విద్యార్థి సంఘాల దౌర్జన్యాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి
ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకుందాం ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఎన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రోజురోజుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలపై కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు మితిమీరి ప్రవర్తిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఎన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన ట్రస్మా జనరల్ బాడీ, నూతన కార్యవర్గ సమావేశం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు భద్రత లేని ప్రైవేట్ పాఠశాలల...