Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2024, 6:05 pm Posted by : ramakrishna

విద్యార్థి సంఘాల దౌర్జన్యాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి

  • ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకుందాం
  • ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఎన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రోజురోజుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలపై కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు మితిమీరి ప్రవర్తిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఎన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన ట్రస్మా జనరల్ బాడీ, నూతన కార్యవర్గ సమావేశం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు భద్రత లేని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు గౌరవం ఉండేది కాదని, 2003 సంవత్సరంలో ట్రస్మా ఏర్పాటుతో మనందరి ఐక్యత వల్ల మనకంటూ సమాజంలో గౌరవం ఏర్పడిందన్నారు. బడ్జెట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసివినతి పత్రం అందించామని అన్నారు. దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. పాఠశాలల్లో కేటగిరీలను చేసి అందులో బడ్జెట్ పాఠశాలలను ఏ కేటగిరీగా తీసుకోవాలని చర్చించడం జరిగిందన్నారు. అదేవిధంగా విద్యార్థి సంఘాల ఆగడాలపై వారిని అరికట్టేందుకురాష్ట్ర డిజిపిని కూడా కలిసి వినతిపత్రం అందివ్వడం జరిగిందన్నారు. అలాగే ప్రవేట్ పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, డ్రైవర్లు, అటెండర్లు, వాచ్మెన్ లకు వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం లేని వారికి అర్హులను గుర్తించి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ట్రస్మా నూతన కార్యవర్గం చేతప్రమాణ స్వీకారం చేయించారు.

The government should take strict action against the atrocities of the student unions38