. . . కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
భారత దేశంలో పెట్రోల్, గ్యాస్, డిజీల్ కొరత లేకుండా ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి అన్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ, ఇరాన్ పై యుద్దాన్ని ఆపాలని, శాంతి నెలకొలపాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో నెహ్రు చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ వరకు సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, ఊర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా కాశాధికారి భక్త వత్సలం, జిల్లా ఉపాధ్యక్షులు శరత్, వెంకట్రాంరెడ్డి, ప్రవీణ్, సిపిఐ వనమాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.