కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

- కొందాపూర్ గ్రామస్తుల ఆందోళన రుద్రూర్,  బతుకమ్మ  : కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీన పరచుకోవాలని కొందాపూర్ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రుద్రూర్ మండలంలోని కొందాపూర్ శివారులోని గైనిగుట్ట ప్రాంతంలో ఉన్న సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని, కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వ అధికారులు వెంటనే స్వాధీన పరుచుకోవాలని కుందాపూర్ గ్రామస్తులు ఆరోపించారు. శనివారం కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో రెండు పెద్ద గుట్టలు ఉండేవని వాటిని మాయం...