Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 October 2024, 4:46 pm Posted by : ramakrishna

కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

  • – కొందాపూర్ గ్రామస్తుల ఆందోళన

రుద్రూర్,  బతుకమ్మ  : కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీన పరచుకోవాలని కొందాపూర్ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రుద్రూర్ మండలంలోని కొందాపూర్ శివారులోని గైనిగుట్ట ప్రాంతంలో ఉన్న సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని, కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వ అధికారులు వెంటనే స్వాధీన పరుచుకోవాలని కుందాపూర్ గ్రామస్తులు ఆరోపించారు. శనివారం కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో రెండు పెద్ద గుట్టలు ఉండేవని వాటిని మాయం చేసి అక్రమంగా ఇటుక బట్టీల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. కొందాపూర్ గ్రామస్తులు ఎన్నో సంవత్సరాల నుండి కబ్జాకు గురైన భూమిపై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇకనైనా తగిన చర్యలు తీసుకొని భూమిని స్వాధీన పరుచుకోవాలని లేనిచో ఆందోళన ఉద్ధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, సంజీవ్, బొంబాయి సాయిలు, బీర్కూరు సాయిలు, మోహన్, కిరణ్, రాజు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

The government should take over the encroached land