Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2025, 7:52 pm Posted by : ramakrishna

మృతి చెందిన సాయిలు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

  • సాయిలు మృతికి కార్యదర్శి, కారోబారులే కారకులు
  • మృతదేహంతో మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన కార్మికులు

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి తండా గ్రామపంచాయతీ పరిధిలో సఫాయి పని చేస్తున్న ఎడపల్లి చిన్న సాయిలు(41)సఫాయి కార్మికుడిగా రోజువారి పనిలో భాగంగా ఇందల్వాయి తాండా గ్రామపంచాయతీకి సఫాయి పని నిమిత్తం వెళ్ళగా గ్రామపంచాయతీ సెక్రెటరీ, కారోబార్ ఇద్దరు నిర్లక్ష్యంగా పంచాయతీ పరిధిలోని ఎలక్ట్రిక్ స్తంభాలకు వీధి దీపాలు పెట్టమని  చెప్పడంతోవారి ఎడపల్లి చిన్న సాయిలు కరెంటు స్తంభాలకు వీధి దీపాలు పెడుతుండగా 11 కెవి కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయి ఛాతికి రెండు కాళ్లకు, తొడలకు కాలిన గాయాలు కాగా అతని చికిత్స నిమిత్తం మనోరమ ఆస్పత్రికి  తరలించారు.తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో  చనిపోయాడని ఎస్ఐ సందీప్ తెలిపారు.కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

The government should support the family of the deceased Sailu

  • మృతదేహంతో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ముందు ధర్నా..

మృతుడు చిన్న సాయిలు శవాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి తీసుకొచ్చి శాంతో కార్యాలయం ముందు బైఠాయించారు.పంచాయతీ కార్యదర్శి,కరోబర్ మండల పరిషత్ ఆఫీసుకు రావాలని ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సందీప్ సంఘటన స్థలానికి చేరుకొని ధర్నా చేపడుతున్న కార్మికులను సముదాయించి అక్కడి నుంచి శవాన్ని తరలించారు.మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారిని వారు కోరారు సాయిలు మృతికి కారకులైన పంచాయతీ కార్యదర్శి,కారబర్ పైన తగిన చర్యలు తీసుకొని సాయిలు కుటుంబాన్ని ఆదుకోవాలని సిఐటియు నాయకులు కార్మికులు డిమాండ్ చేశారు.మృతుని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా చూడాలని వినతి పత్రం అందించారు. మృతుని కుటుంబానికి న్యాయం జరగనట్లయితే దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడానికి వెనుకాడమని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఇందల్వాయి మాజీ సర్పంచ్ డాక్టర్ సదానంద్,సిఐటియు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు మాదరి గంగారం,దళిత సంఘాల నాయకులు పాశంకుమార్, కిష్టయ్య,నామల గంగాధర్, తలారి రాజు,బిక్షపతి,నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

The government should support the family of the deceased Sailu