ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆటో కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్ఎస్పీ నగర కన్వీనర్ కటారి రాములు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా మినీ ట్యాంక్ బండ్ ఆటో స్టాండ్ వద్ద యూటీయూసీ అనుబంధ శ్రామిక్ ఆటో యూనియన్ నిజామాబాద్ స్టికర్ లను ఆటో కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ నగర కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (మహాలక్ష్మి) ఉచిత బస్సు పథకం అమలు చేయడంతో ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని...