Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 7:41 pm Posted by : ramakrishna

కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

 

. . . కళ కోసం ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయని గొప్ప కళాకారుడు కీ బోర్డు ఆంజనేయులు

 

. . . కళా లోకానికి ఆంజనేయులు లేని లోటు తీరనిది – సిర్ప లింగం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి సారధి ఉద్యోగం రాకుండానే కీబోర్డ్ ఆంజనేయులు మరణించడం బాధాకరమని సిర్ప లింగం, రాంపూర్ సాయి అన్నారు. ఆదివారం సుభాష్ నగర్ లో గల పెన్షనర్స్ భవన్ లో సకల కళాకారుల ఆధ్వర్యంలో కీబోర్డ్ అంజన్న సంతాప సభ నిర్వహించారు. ఈ సంతాప సభకు సిర్ప లింగం అధ్యక్షత వహించారు. అనంతరం కళాకారుల ఆధ్వర్యంలో ఆంజన్న సతీమణికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కళాకారులు నివాళులర్పించారు. ప్రజా సంఘనాయకులు కళా సంస్థల అధ్యక్ష కార్యదర్శులు అంజన్న గురించి మాట్లాడారు. అనంతరం సిర్ప లింగం మాట్లాడుతూ అంజన్న తెలంగాణ పోరాటంలో ధూమ్ ధాం తో పాటు అనేక కళా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. అందరు కళాకారులతో స్నేహభావం తో మెలిగే మృదు స్వభావి అని కొనియాడారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఉత్తర తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం వరకు అనేక జిల్లాల్లో ప్రోగ్రాంలలో పాల్గొన్నారన్నారు. అంజన్న తన కీ బోర్డు ద్వారా అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు సేవలు అందించారన్నారు. ఈ సందర్భంగా అష్ట గంగాధర్, రాంపూర్ సాయి, కోకిల నాగరాజు, ఆర్టీసీ శ్రీనివాస్ లు మాట్లాడుతూ అంజన్న అందరివాడని, మృదు స్వభావం కలిగిన వ్యక్తి అని, ఎవరిని నొప్పించకుండా ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాడని అన్నారు. ఆయన భౌతికంగా మా మధ్య లేకున్నా, మాతోనే ఉంటారన్నారు. కళాకారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ప్రభుత్వాలు కళాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కళ పై ఉన్న అభిమానంతో ఇంటిని పట్టించుకోకుండా జీవితమంతా కల కోసమే పని చేసే వాడే కళాకారుడు అని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఎన్నడూ కల ను విడిచిపెట్టలేని వారే కళాకారులని, ప్రభుత్వాలు కళాకారులను ఆదుకుంటే సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారని తెలిపారు. ఇకనుంచి ఏ కళాకారుడికి కష్టమొచ్చిన కళాకారులం అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అష్ట గంగాధర్, రాంపూర్ సాయి, సాయి లవోల, కోకిల నాగరాజు, ఆర్టీసీ శ్రీనివాస్, వాడి కర్క రమేష్, కృష్ణ, అరుణోదయ దాసు, దుష్యంత్, గోరకంటి రాజు (పాడ్), క్రాంతి, మహేందర్, మరి పెల్లి మనోహర్, మిద్దె నర్సారెడ్డి, సంజీవ్  ప్రజానాట్యమండలి, నర్సింగ్, పాట మహేష్, కీ బోర్డ్ వంశీ, వర్మ, సౌండ్ అరుణ్, డోలక్ భీమ్, సవిత, విజయ్ మాల, నిహారిక, మనోజ, మీనా, గోదావరి, గణేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.