Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 July 2025, 12:34 pm Posted by : ramakrishna

ప్రభుత్వం తులం బంగారం పథకాన్ని వెంటనే ప్రారంభించాలి

వేల్పూర్, బతుకమ్మ : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. లక్ష చెక్కుతో పాటు అదనంగా ఇస్తామన్న తులం బంగారం పథకంను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఎమ్మెల్యే తన స్వగృహంలో వివాహలు జరిగి కొత్తగా మంజూరు కావాల్సిన 244 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారఖ్ దరఖాస్తూలపై సంతకాలు చేసిన ఆయన కొత్తగా మంజూరు కోసం వచ్చే దరఖాస్థులపై తన కానిస్టేన్సీకి వచ్చినపుడల్లా ఎప్పటికప్పుడు సంతకాలు తీసుకోవాలని ఆదికారులకు సూచించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కొత్తగా చెక్కులు మంజూరయ్యే లబ్దిదారులతో పాటు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంటి ఇప్పటి వరకు అందరు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందుకున్న లబ్దిదారులందరికి తులం బంగారం ఇవ్వాల్సిందేనని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.