Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2025, 6:03 pm Posted by : ramakrishna

 తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వమే  కొనుగోలు  చేయాలి

 

 

. . . తరుగు పేరిట మిల్లర్ల దోపిడీ అరికట్టి రైతులను కాపాడాలి

. . . జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ , బతుకమ్మ:  

 

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా  ఇంకా పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు చేయడంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది అని మాజీ మంత్రి,ఏమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా రోడ్లపై వర్షాలకు తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని మరియు ఇంకా కొనుగోలు చేయని వడ్ల కుప్పలను రైతులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. 15రోజుల నుండి ఎదురు చూస్తున్న ఇంకా మా వడ్లు ఈ ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదు, చివరికి అకాల వర్షాలు పడి ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు అని ఎమ్మెల్యే అన్నారు. తడిసిన ,మొలకలు వచ్చిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. తడిచి మొలకలు వచ్చిన ధాన్యం పరిశీలిస్తున్న సమయంలో అక్కడే ఉన్న రైతు ఈ రోజే కొనుగోలు చివరి రోజు రేపటి నుండి కొనుగోలు చేయం అని అధికారులు అంటున్నారు అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అక్కడి నుండే కలెక్టర్ కి ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే అన్నారు. పడగల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నడుస్తుందని వారు రేపటి నుండి వడ్లు కోనం  అని రైతులతో అంటున్నారు అని నా దృష్టికి వచ్చింది మరో మూడు నాలుగు రోజులు సెంటర్ అలాగే కొనసాగించి పూర్తి ధాన్యం కొనుగోలు అయ్యేలా చూడాలని కలెక్టర్ ని కోరారు.రేపటి నుండి వడ్లు కొనుగోలు చేయం అని చెబూతు రైతులను బయపడేలా చేస్తున్న అక్కడే ఉన్న ఐకేపీ అధికారి ని ఎమ్మెల్యే మందలించారు.ఇలా చేస్తే మీమీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తది అని హెచ్చరించారు.

The government should buy the wet sprouted grain.