పీఆర్సీ అమలుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

  . . . టీపీటీఎఫ్ అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చినా, మూడు సంవత్సరాలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీపీటీఎఫ్ అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ విమర్శించారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) పిలుపు మేరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం శంకర్ భవన్ పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. పాఠశాల విరామ సమయంలో నిర్వహించిన ఈ...