- మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శల గుప్పిచ్చారు. పంటకు గిట్టుబాటు ధర పెంచుడు కాకుండా ఉన్న ధర ఇవ్వని ఏకైక ప్రబుత్వంఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. నిజామాబాద్ లో మొక్క జొన్న కొనుగోలు చేయక రోడ్ల వెంబడి చూస్తే రైతుల బాధ వర్ణానీతం అని అన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వని రైతు వ్యతిరేక ప్రభుత్వం పై రైతులకు గిట్టు బాట ధర పంట కొనుగోలు చేయని పక్షంలో ఆర్మూర్ గడ్డ నుండి తిరుగుబాటు ప్రారంభం అవుతుంది అని ఎర్రజొన్నల తరహా ఉద్యమం చేయడం ఖాయం అని హెచ్చరించారు. రైతులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తాం అని తెలిపారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలువలేదు అని ఆర్మూర్ అడ్డా రైతులకు పోరాట గడ్డ అని తెలిపారు. ఇక మీదట కాంగ్రెస్ నాయకులను ఎక్కడ కనబడిన గెరావ్ చేస్తాం అని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలు అని చెప్పి ఒక్క గ్యారంటీ కూడా సక్రమంగా అమలు చేయని రేవంత్ సర్కార్ కు గుణపాఠం చెప్పడానికి రోజులు దగ్గర్లో ఉన్నాయి అని అన్నారు.