హైదరాబాద్, బతుకమ్మ : జీహెచ్ ఎంసీలో సూపర్‌వైజర్‌లు కార్మికుల నుంచి కమీషన్ వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఒక్కో కార్మికుడి వద్ద రూ.500పైన వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కమీషన్ ఇవ్వకపోతే అటెండెన్స్ వేయకపోవడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఉన్నతాధికారులకు కార్మికులు ఫిర్యాదు చేశారు.