విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుంది
పదో తరగతి పరీక్షల నిర్వహణపై ’ ఎక్స్‘ వేదికగా స్పందించిన కవిత వెబ్ న్యూస్, బతుకమ్మ : పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేక కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈమేరకు ’ ఎక్స్‘ వేదికగా కవిత స్పందించారు. ’పరీక్ష పూర్తి కాకముందే ప్రశ్నా పత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమవడం, సంస్కృతం ప్రశ్నా పత్రానికి బదులు తెలుగు ప్రశ్నా పత్రం ఇవ్వడం సర్కార్ పేలవమైన పనితీరుకు నిదర్శనం. విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద...