Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 March 2025, 2:09 pm Posted by : ramakrishna

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుంది

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ’ ఎక్స్‘ వేదికగా స్పందించిన కవిత

వెబ్ న్యూస్, బతుకమ్మ : పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేక కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈమేరకు ’ ఎక్స్‘ వేదికగా కవిత స్పందించారు. ’పరీక్ష పూర్తి కాకముందే ప్రశ్నా పత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమవడం, సంస్కృతం ప్రశ్నా పత్రానికి బదులు తెలుగు ప్రశ్నా పత్రం ఇవ్వడం సర్కార్ పేలవమైన పనితీరుకు నిదర్శనం. విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద అట్టిపెట్టుకోవడం వల్లే రాష్ట్రంలో విద్యారంగం విస్మరణకు గురవుతున్నది. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్న వారి పై బూతులు తిట్టడం మానేసి పాలన పై దృష్టి పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా‘ అని కవిత ట్వీట్ చేశారు.