వ్యవసాయ రంగం స్థిరమైన పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
. . . వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగం స్థిరమైన పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం మంత్రి అధ్యక్షతన కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కార్యాలయంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో ప్రధానంగా వానాకాలం-2026 కోసం...