Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 5:45 pm Posted by : ramakrishna

వ్యవసాయ రంగం స్థిరమైన పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

 

. . . వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు  

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగం స్థిరమైన పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం మంత్రి అధ్యక్షతన కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కార్యాలయంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో ప్రధానంగా వానాకాలం-2026 కోసం వరి విత్తనాల అవసరం, సరఫరా, అలాగే పంటల మార్పిడి పై విశ్లేషణ నిర్వహించారు. సుమారు 10.80 లక్షల ఎకరాలకు పైగా వరి విత్తనాల ప్రణాళిక రూపొందించారు. అందుకు అవసరమైన విత్తనాల సరఫరా, వ్యయం, ప్రత్యామ్నాయ రకాలను ప్రోత్సహించే అంశాలపై అధికారులు వివరాలు సమర్పించారు. అలాగే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా నిర్వహించబడే రైతు వారోత్సవం కార్యక్రమాలపై కూడా చర్చించారు. ఈ కార్యక్రమం మే 4 నుండి మే 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు రాములు నాయక్ (మాజీ ఎమ్మెల్సీ), భవాని మరికంటి, సునీల్, గడుగు గంగాధర్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, ఎపిసి సురేంద్ర మోహన్, మెంబర్ సెక్రటరీ గోపాల్, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.