సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుంది

నిజామాబాద్, బతుకమ్మ : సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుందని సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ లో బుధవారం నిర్వహించిన రెండో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు.  ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామన్నారు.  తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటి వరకు పల్లెలలో నెలకొన్న వెట్టి చాకిరీ, భావ వ్యక్తీకరణపై ఆంక్షలు, మాతృ భాష అణిచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు తొలగి 17...