Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2024, 4:13 pm Posted by : ramakrishna

విద్యార్థుల బంగారు భవిష్యత్తు గురువులపైనే ఉంది.

సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది

నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేల వ్యాఖ్య

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

విద్యను అభ్యసించే విద్యార్థుల బంగారు భవిష్యత్తు వారి విద్యను నేర్పే గురువులపైనే ఉందనినిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, భూపతి రెడ్డి లు పేర్కొన్నారు.ప్రైవేటు ఉపాధ్యాయుల హెల్త్ కార్డు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. అందుకే సమాజంలో ఉపాధ్యాయులకు వారికంటూ ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆదివారం నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్ లో ట్రస్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గురుపూజోత్సవంలో అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

The golden future of the students lies with the teachers.

ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు గురువులపైనే ఆధారపడి ఉందన్నారు. జాతీయతా భావం పెంపొందించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవస్థలో గురువులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విద్యార్థులు శ్రద్ధతో చదవాలన్నారు. అనంతరం వివిధ ప్రవేట్ పాఠశాలలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీఈఓ దుర్గా ప్రసాద్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి రమేష్ రావు, ప్రతినిధులు యాదగిరి శేఖర్ రా వు, రాఘవేంద్ర రెడ్డి, స్పోక్స్ పర్సన్ జయసింహ గౌడ్, జిల్లా అధ్యక్షుడు నిత్యానంద్, కార్యదర్శి అరుణ్, మధు, నరసింహారావు,తదితరులు పాల్గొన్నారు.

The golden future of the students lies with the teachers.