Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 7:29 pm Posted by : ramakrishna

సామాజిక తెలంగాణ నిర్మాణమే తెలంగాణ జాగృతి లక్ష్యం

  • జాగృతి వర్కంగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సామాజిక తెలంగాణ నిర్మాణమే తెలంగాణ జాగృతి లక్ష్యం అని జాగృతి వర్కంగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ అన్నారు. నిజామాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం జిల్లా అడ్ హక్ కమిటి నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అథితిగా తెలంగాణ జాగృతి కార్యనిర్వాహక అదక్షులు ఎల్.రూప్ సింగ్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మట్లాడూతూ.. సామాజిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ జాగృతి అద్యక్షరాలు కల్మకుంట్ల కవిత అకుంటిత ధీక్షతో పోరాడుతున్నారు అని అన్నారు. ఆ లక్ష్యం సాధన  కొరకు ప్రతి నాయకుడు పని చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ లో తెలంగాణ జాగృతి  జనం బాట లో భాగంగా ప్రజల నుండి వచ్చిన ప్రతి సమస్యల పరిష్కారం కొరకు ముఖ్యమంత్రికి, మంత్రులకు కవిత ఉత్తరాలు రాసి ఒత్తిడి పెంచుతున్నారని అన్నారు.   స్థానిక అధికారులపై తెలంగాణ జాగృతి నాయకులు ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆనంద్ పాల్గొన్నారు.