Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 5:46 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యం

 

. . . ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

 

జుక్కల్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, అంకితభావంతో పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహించడం, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్ఠం చేయడమే “సంగఠన్ సృజన్ అభియాన్” ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “సంగఠన్ సృజన్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా రాయచూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కోసం ఏఐసీసీ పరిశీలకుడిగా జుక్కల్ ఎమ్మెల్యే సోమవారం కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాయచూర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జిల్లా అధ్యక్షుడి ఎంపికపై విస్తృతంగా చర్చించారు. పార్టీ బలోపేతం, సమర్థ నాయకత్వం ఎంపిక, సంస్థాగత నిర్మాణంపై పలు సూచనలు చేశారు. సమావేశంలో కర్ణాటక మాజీ మంత్రి రాజశేఖర్ పాటిల్, కేపీసీసీ పరిశీలకుడు మక్బూల్ భగవాన్, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ, డీసీసీ అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటాగి, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి కె. శాంతప్ప, కేపీసీసీ పరిశీలకుడు కొప్పుల, రాయచూర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.