Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2024, 2:31 pm Posted by : ramakrishna

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా..

బిచ్కుంద, బతుకమ్మ: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు క్యాంపు కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించారు. జుక్కల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమమైన లక్ష్మీకాంతారావు.. ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటవెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. తమకు అందుబాటులో ఉంటూ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యలను వింటూ పరిష్కారానికి కృషి చేస్తుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

The goal is to solve public problems.