నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

రుద్రూర్, బతుకమ్మ : విద్యుత్ సంస్థ అభివృద్ధిలో భాగంగా కొత్తపల్లి సబ్ స్టేషన్ లో, కోటగిరి సెక్షన్, రుద్రూర్ సబ్ డివిజన్ లో నూతన వీసీబీలను బోధన్ డీఈ ముక్తార్ ప్రారంభించారు. ప్రజలకు గృహ వినియోగదారులకు   రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే క్రమంలో నూతన వీసీబీలను  ప్రారంభించారు.  కొత్తపల్లి అగ్రికల్చర్ ఫీడర్ కి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందజేయడం జరుగుతుందన్నారు.  రూ.  మూడు లక్షలు వ్యయంతో వీసీబీలను ప్రారంభించమన్నారు. ఎన్పీడీసీఎల్ చైర్మన్ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.  విద్యుత్ ఉద్యోగులు...