Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 September 2025, 1:54 pm Posted by : ramakrishna

నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

రుద్రూర్, బతుకమ్మ : విద్యుత్ సంస్థ అభివృద్ధిలో భాగంగా కొత్తపల్లి సబ్ స్టేషన్ లో, కోటగిరి సెక్షన్, రుద్రూర్ సబ్ డివిజన్ లో నూతన వీసీబీలను బోధన్ డీఈ ముక్తార్ ప్రారంభించారు. ప్రజలకు గృహ వినియోగదారులకు   రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే క్రమంలో నూతన వీసీబీలను  ప్రారంభించారు.  కొత్తపల్లి అగ్రికల్చర్ ఫీడర్ కి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందజేయడం జరుగుతుందన్నారు.  రూ.  మూడు లక్షలు వ్యయంతో వీసీబీలను ప్రారంభించమన్నారు. ఎన్పీడీసీఎల్ చైర్మన్ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.  విద్యుత్ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా భద్రతతో  పని చేయాలని సూచించారు. అలాగే రైతుల కూడా ఎవరు సొంతగా పనులు చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ ఏడీఈ తోట రాజశేఖర్, ఏఈ కోటగిరి బుజ్జిబాబు, కోటగిరి విద్యుత్ సిబ్బంది ప్రేమ్ దాస్, వెంకటేశం, రాజు గౌడ్, రవి, వైద్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.