Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 8:19 pm Posted by : ramakrishna

నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యం

  • నిజామాబాద్ ఎస్ఈ రాపల్లి రవీందర్

 

వర్ని, బతుకమ్మ :  వర్ని మండలం లో కూనీపూర్ విద్యుత్ ఉప కేంద్రంలో అదనంగా 3.15 ఎం వి ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ను నిజామాబాద్ ఎస్ఈ రాపల్లి రవీందర్ మంగళవారం ప్రారంభించారు. వచ్చే రబి సీజన్లో, వేసవిలో రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్తు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఇంటర్ లింకింగ్ లైన్స్, కొత్త బ్రేకర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 33/11 కెవి కూనీపూరు విద్యుత్ ఉపకేంద్రంలో అదనంగా 3.15 ఎం వి ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్, ఎల్ వి బ్రేకర్, కూనిపూర్ వ్యవసాయ ఫీడర్ కు కొత్త బ్రేకర్ ఏర్పాటు చేసి చార్జ్ చేయడం జరిగిందని తెలిపారు. దీంతో రైతులకు, ప్రజలకు వచ్చే రబి సీజన్లో నిరంతరమైన విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో ఏ విధంగా అయితే వేసవిలో నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేసామో ఈ సంవత్సరం కూడా చేస్తామని అన్నారు. అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ తో దగ్గరలో ఉన్న జలాల్పూర్, జాకోర విద్యుత్ ఉపకేంద్రాలలో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినప్పుడు కూలీపూర్ సబ్స్టేషన్ నుంచి 11 కెవి లీడర్స్కు విద్యుత్ సరఫరా చేసుకోవచ్చునని 11 కెవి కూనిపూర్ వ్యవసాయ ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్థానిక లైన్మెన్, ఏఈ ఫోన్స్ బిజీ వచ్చినప్పుడు మీరు మీకు ఎలాంటి విద్యుత్తు అవసరాల కు  టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు కాల్ చేయవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండి ముక్తార్, డి ఈ ఆపరేషన్ బోధన్ డి.వెంకటరమణ, డి ఈ ఎం ఆర్ టి నిజాంబాద్ తోట రాజశేఖర్, ఏ డి ఇ ఆపరేషన్ రుద్రూర్ కె నటరాజ్, ఏ డి ఈ టిఆర్ఇ నిజాంబాద్, శ్రీనివాస్ ఏ ఈ వర్ని సాయిలు, ఏ ఈ టి ఆర్ ఇ  బాలకిషన్, సబ్ ఇంజనీర్ ఎస్ ఎల్ ఐ వేణుగోపాల్, ఎల్ ఐ శ్రీనివాస్ శ్రీరామ్ నాయక్, స్థానిక విద్యుత్తు సిబ్బంది, స్థానిక ఏఎంసీ చైర్మన్ కుల్ కర్ని సురేష్, కూనిపూర్ రాజారెడ్డి, స్థానిక రైతులు సిబ్బంది పాల్గొన్నారు.

The goal is to provide quality and uninterrupted power supply.