. . . ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ మడూరి సందీప్ రావు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడమే విద్యార్థి పరిషత్ ధ్యేయమని, అందులో విద్యార్థులందరూ భాగస్వాములు కావాలని, దేశవ్యతికశక్తులను దేశం నుండి తరిమికొట్టాలని ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబెర్ మడూరి సందీప్ రావు పిలుపునిచ్చారు. స్థానిక కాకతీయ హైస్కూల్ లో గురువారం నిర్వహించిన ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ ఏబీవీపీ 77 ఏళ్ల ప్రస్థానం, ప్రారంభమైన నాటి నుండి నిర్మించిన ఉద్యమాలు, సాధించిన విజయాల గురించి వివరించారు.

విద్యార్థి పరిషత్ వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం అనే లక్ష్యంతో పనిచేస్తుందని, విద్యార్థి పరిషత్ ప్రారంభం నుండి విద్యార్థుల గొంతుకగా ఉంది కాబట్టే నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఆవిర్భవించిందని అన్నారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ కైరి శశిందర్, నగర సంఘటన కార్యదర్శి శివ, లక్కీ, సౌరభ్ తదితరులు పాల్గొన్నారు.
