Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 5:17 pm Posted by : ramakrishna

తెలంగాణను నెంబర్ వన్ గా నిలపడమే లక్ష్యం

 

. . . అసెంబ్లీలో రూ. 3,24,234 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను భట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశ పెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన తమ ప్రభుత్వ లక్ష్యాలను, ప్రాధాన్యతలను సభకు వివరించారు. ప్రజలే మాకు పరమావధి అని, సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టె ఈ గొప్ప అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని భట్టి విక్రమార్క తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని, ఇందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ అంటే కేవలం అంకెల చుట్టూ తిరిగే సంఖ్యల గారడి కాదని వాస్తవాలకు దగ్గరగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందించామని అన్నారు. గొప్పల కోసం మేము ఎప్పుడు అబద్దాలు చెప్పబోమన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమానికి, మహిళాభివృద్దికి తొలి ప్రాధాన్యత ఉంటుందని ఆయన వెల్లడించారు. మహిళా సాధికారత దిశగా కీలక కేటాయింపులు చేసినట్టు సూచించారు. రాష్ట్ర సంస్కృతిని కాపాడటంలో తమ ప్రభుత్వం ముందుంటుందని, గద్దర్ అవార్డుల ద్వారా కళాకారులను గౌరవించామని తెలిపారు. అలాగే మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహించామని గుర్తు చేశారు.

 

The goal is to make Telangana number one.

 

. . . తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు

రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,24,234 కోట్లని డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందులో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లని, ములధన వ్యయం రూ.47,267 కోట్లని తెలిపారు. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా ఉందని, వృద్ది రేటు 10.20 శాతంగా ఉందన్నారు. జాతీయ వృద్ది రేటు కంటే తెలంగాణ వృద్ది రేటు 2.7 శాతం ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ తలసర ఆదాయం 1.9 రేట్లు పెరింగిందని తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నామని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్ అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పశు సంవర్థక శాఖకు రూ.1529 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు, విద్యా శాఖకు రూ.26,674 కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు, కార్మిక శాఖకు రూ.998 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ. 7937 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.3769 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి రూ.6 వేల కోట్లు, గ్రహ నిర్మాణ శాఖకు రూ.7430 కోట్లు, ఐటీ శాఖకు రూ.875 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.3490 కోట్లు, చేనేత రంగానికి రూ.258 కోట్లు, పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ది శాఖకు రూ.33688 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.22615 కోట్లు, ఆర్ అండ్ బీ శాఖకు రూ.12789 కోట్లు, న్యాయ శాఖకు రూ.2367 కోట్లు, హెచ్-సిటీ పథకం కింద రూ.2654 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ది శాఖకు రూ.17907 కోట్లు, హోం శాఖకు రూ.11907 కోట్లు, గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రూ.500 కోట్లు, పర్యాటక శాఖకు రూ.1224 కోట్లను కేటాయించినట్టు ఆయన తెలిపారు.