. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాం
. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణగుప్తా
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: భారత దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతూ గొప్ప ఆర్ధిక వ్యవస్థ గా ప్రపంచంలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మార్వాడిగల్లీ బూత్ నెంబర్ 43లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధన్ పాల్ ప్రధాని నరేంద్రమోదీ సందేశాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశాన్ని ఇచ్చారని అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో భారత సైన్యం చూపిన వీరత్వానికి ప్రపంచదేశాలు అశ్చర్యపోయాయి అన్నారు. ఆపరేషన్ కాగర్ తో 2026 మార్చిలోగా దేశంలో నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. ఎందరో జాతీయ వాదులు, జవాన్ ల మృతికి కారకుడైన నంబల కేశవరావు వంటి కరుడుకట్టిన తీవ్రవాదులను హతమార్చడం వల్ల దేశ ప్రజలందరు సంబురాలు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ రంగంలో భారత దేశం సాంకేతికంగా ఎంతో అభివృద్ధిని సాధించిందని అన్నారు మన తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో డ్రోన్ పరికరంతో 50 ఎకరాలలో మహిళలు పొలాలకు స్ప్రే చేసిన విధానం నిదర్శనం అన్నారు. వ్యవసాయ డ్రోన్ పరికరాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తూ మహిళను, యువతను వ్యవసాయ రంగంలో ప్రోత్సాహిస్తోందని అన్నారు. కార్యక్రమంలో సీతారాం పాండే, కమల్, కృష్ణ, గోపాల్, వినయ్, ధనరాజ్, మారుతి, జయ ప్రకాశ్, బాలకిషన్ ఓం అటల్ అశోక్ రఘునాథ్ చౌదరి శ్రీను పవన్ ముందడ సత్యనారాయణనాగలాసుఖీరాజ్ తదితరులు పాల్గొన్నారు.