Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 7:13 pm Posted by : ramakrishna

శాంతి భద్రతలు పరిరక్షించడమే లక్ష్యం

 

. . . పోలీస్ ప్రజావాణిలో 16 ఫిర్యాదులను స్వీకరించిన అదనపు డీసీపీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని నిజామాబాద్ అదనపు డీసీపీ ఎన్.శుభం ప్రకాష్ తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు దారుల నుంచి 16 ఫిర్యాదులను అదనపు డీసీపీ స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల యొక్క ఎస్.ఐ, సి.ఐ లతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని తెలసుకుని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని ఆయన తెలియజేశారు.