. . . ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ రెంజల్ మండలం హడాక్ కమిటీ ఎన్నిక
రెంజల్, బతుకమ్మ :
యువత చెడు మార్గాలకు వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలనే లక్ష్యంతో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రారంభమయ్యిందని యువజన సంఘం నాయకులు నల్ల నవీన్ అన్నారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో రామాలయం వద్ద ఆదివారం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని హడక్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ అసోసియేషన్ ప్రారంభం నాటి నుండి నేటి వరకు స్వచ్ఛభారత్, చలివేంద్రాలు, రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంప్స్, జాతీయ నాయకుల జయంతిలు, వర్ధంతిలు లాంటి కార్యక్రమాలు, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా ఉండేందుకు సోషల్ అవేర్ నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తు యువతలో స్ఫూర్తి నింపాలనే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఈ యువజన సంఘాన్ని విస్తరణ చేస్తూ రెంజల్ మండలం యొక్క హాడక్ కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా సంతోష్ (కళ్యాపూర్), ఉపాధ్యక్షులుగా మన్నే గంగాధర్ (దూపల్లి), మచ్చకూరి గంగరాజు (కందకుర్తి), జనరల్ సెక్రెటరీగా బండ్ల రాజ్ కుమార్, సెక్రెటరీగా మమ్మాయి సాయి ప్రకాష్ (కందకుర్తి), ఆర్మూర్ నవీన్ (రెంజల్), కోశాధికారిగా గాండ్ల సాయికుమార్ (నీలా), కాశం భరత్ (కళ్యాపూర్), హెల్త్ క్యాంప్ ఇంచార్జ్ గా జి.సాకేత్ (బాగేపల్లి), శ్యామ్ (దూపల్లి), యూత్ ఇంచార్జ్ గా గాండ్ల గోపి (బోర్గాం), కాలేవర్ సంజీవ్ (కళ్యాపూర్), సభ్యులుగా కంచ శ్రీకాంత్, పాముల అఖిలేష్, బైకొండ రాకేష్, కే లక్ష్మణ్, శ్రీ రాజ్వర్ వినోద్, కిషోర్, నీలం సాయి కుమార్, కొట్టుర్ గంగప్రసాద్, గణేష్, సిహెచ్. సుమన్, సలహాదారునిగా కంఠం బాలక్రిష్ణ లను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.
