గ్రామీణ బాలికల ప్రతిభను ప్రోత్సాహించడమే లక్ష్యం
పిట్లం, బతుకమ్మ : గ్రామీణ ప్రాంత బాలికలు విద్యలో రాణించి తమ ప్రతిభను చాటుకునేలా ప్రోత్సహించడమే ‘సేవ్ ది గర్ల్ చైల్డ్ ఫౌండేషన్’ లక్ష్యమని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పిట్లం మండలంలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 23 మంది విద్యార్థినులను ఘనంగా సత్కరించారు. నవాబ్ మహిపాల్ గౌడ్ (మాజీ ఎంపీపీ) జ్ఞాపకార్థం ఆయన మాతృమూర్తి అనసూయ చేతుల మీదుగా విద్యార్థినులకు మెమెంటోలు అందజేశారు. అలాగే ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు రూ.3 వేలు , రూ.2...