Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 7:42 pm Posted by : ramakrishna

గ్రామీణ బాలికల ప్రతిభను ప్రోత్సాహించడమే లక్ష్యం

 

పిట్లం, బతుకమ్మ :

 

గ్రామీణ ప్రాంత బాలికలు విద్యలో రాణించి తమ ప్రతిభను చాటుకునేలా ప్రోత్సహించడమే ‘సేవ్ ది గర్ల్ చైల్డ్ ఫౌండేషన్’ లక్ష్యమని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పిట్లం మండలంలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 23 మంది విద్యార్థినులను ఘనంగా సత్కరించారు. నవాబ్ మహిపాల్ గౌడ్ (మాజీ ఎంపీపీ) జ్ఞాపకార్థం ఆయన మాతృమూర్తి అనసూయ చేతుల మీదుగా విద్యార్థినులకు మెమెంటోలు అందజేశారు. అలాగే ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు రూ.3 వేలు , రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.50 వేల నగదు పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమానికి ‘సేవ్ ది గర్ల్ చైల్డ్’ ఫౌండర్, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్‌తో పాటు ఆయన సోదరులు సుదర్శన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ సంపూర్ణ సహకారం అందించారు. గ్రామీణ ప్రాంత బాలికల విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ప్రతిభావంతులైన విద్యార్థినులకు అవార్డులు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ రమణారావు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.