సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయం

హైదరాబాద్, బతుకమ్మ : సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయమని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.  తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన  కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో కాళోజీ నారాయణ రావు, చాకలి ఐలమ్మ ల చిత్రపటాలకు కవిత నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రజలను కదలించిన కవి కాళోజీ అని అన్నారు.  పుట్టుక నీది, చావు నీది బతుకంతా తెలంగాణది అని ఆయన మనలో స్ఫూర్తి నింపారని అన్నారు.  కవికి మరణం ఉండదని,  కాళోజీ అనుసరించిన విలువలు, కవిత్వం ఇప్పటికీ ఆయనను గుర్తు...