Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2025, 4:07 pm Posted by : ramakrishna

సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యం

  • ఆనాడు ఉద్యమంలో పనిచేశాం
  • రాష్ట్రాన్ని సాధించిన విన్నింగ్ టీమ్ గా నిలిచాం
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ : ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఒక్కటే.. సామాజిక తెలంగాణ సాధించుకోవడం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి లో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు పాండురంగా రెడ్డి, బీఎస్ పీ మల్కాజిగిరి ఇన్ చార్జి అందుగుల సత్యనారాయణ సహా పలువురు ఉద్యమకారుల చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడారు. ‘‘మనందరం ఆనాడు ఉద్యమంలో పనిచేశాం. రాష్ట్రాన్ని సాధించిన విన్నింగ్ టీమ్ గా నిలిచాం. తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు బాగుండాలి. యువతరం, ఆడబిడ్డలు అందరూ బాగుండాలి. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని ఆలోచన చేస్తున్నాం. పెట్టుకున్న కొత్త లక్ష్యం కోసం పాత ఉద్యమకారుల పునరేకికరణ జరుగుతోంది. పాత శక్తులందరం కలిసిన సందర్భంగా మన పవర్ ఏంటన్నది తెలంగాణ సమాజం గమనిస్తది. ఇలాంటి పునరేకికరణ ద్వారా సమాజానికి మంచి జరుగుతుంది. పాండురంగారెడ్డి డెడికేషన్ గురించి తెలంగాణ మొత్తం తెలుసు.

The goal is to achieve social Telangana.

ఆయన మీద ఎన్నో కేసులున్నాయి. ఆయన ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. తమ్ముడు యాదయ్య చనిపోతే పాండురంగారెడ్డి గారు చాలా ఎమోషనల్ అయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన వ్యక్తి. అలాంటి తను సామాజిక తెలంగాణ కోసం రావటం చాలా సంతోషం. ఇలాంటి శక్తులు మనకు ఒక్కో జిల్లాలో యాడ్ అవుతూ ఉన్నారు. వారందరినీ ఓపెన్ హార్ట్ తో వెల్ కమ్ చేస్తున్నాం. ఉద్యమకారులు కూడా ఉద్యమకారుల ఫోరమ్ పేరుతో పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. కళాకారులు కూడా తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరుతున్నారు. ముఖ్యంగా పేదల పక్షాన నిలవటమే జాగృతి ప్రధాన లక్ష్యం. కుత్భుల్లాపూర్ లో హైడ్రా పేదల ఇళ్లు కూల్చితే మొదట వారికి మద్దతుగా నిలిచింది జాగృతియే. పేదల పక్షాన పనిచేసే శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుంది. జాగృతి లో చేరిన వారందరికీ  సముచిత స్థానం కల్పిస్తాం’’ అని అన్నారు.

The goal is to achieve social Telangana.