Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 3:53 pm Posted by : ramakrishna

ప్రజలకు నాణ్యమైన ఆహారమే అందించడమే లక్ష్యం

 

. . . ఫుడ్ సెప్టీ అధికారి సవిత

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ ఫుడ్ సెప్టి అఫిసర్ సవిత అన్నారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ( ఎఫ్ఎస్ఓ) నవిత పర్యవేక్షణలో స్థానిక ఐడీఓసీ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఆహార భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం, ఫుడ్ హ్యండర్లకు శిక్షణా తరగతులను నిర్వహించారు.  ఈసంధర్బంగా ఎఫ్ఎస్ఓ మాట్లాడుతూ…ఆహారాన్ని తయారు చేసేటప్పుడు, పంపిణీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తయారు చేసేటప్పుడు కనీస ప్రమాణాల పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా  జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 160 మంది ఫుడ్ హ్యాండ్లర్లు (ఆహార నిర్వాహకులు), అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

The goal is quality food for the people