Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 4:23 pm Posted by : ramakrishna

పది ఫలితాల్లో బాలికదే పైచేయి

  • మొదటి స్థానంలో మహబూబాబాద్
  • చివరి స్థానంలో వికారాబాద్

 

హైదరాబాద్, బతుకమ్మ : పదో తరగతి పరీక్షా ఫలితాలను బుధవారం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 2022-25 విద్యా సంవత్సరానికి గాను మార్చిలో జరిగిన పరీక్ష ఫలితాలలో 92.78శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 2,46,029 మంది పరీక్షలకు హాజరైతే 2,31,911మంది ఉత్తీర్ణులయ్యారు. వారి ఉత్తీర్ణత శాతం 94.26గా రికార్డయింది. 2,50,345మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 2,28,608మంది ఉత్తీర్ణత సాధించి 91.32శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. 33 జిల్లాలకు సంబంధించిన పదో తరగతి ఫలితాల్లో అతి చిన్న జిల్లా అయిన మహబూబాబాద్ జిల్లా 99.29శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువగా, 73.97శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలించింది. 4,96374మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,60,519మంది ఉత్తీర్ణత సాధించిగా మిగిలిన వారు ఫెయిల్ అయ్యారు. ఎస్ఎస్సీ బోర్డ్ అదికారులు అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల తేదీలలో పాటు రీ వాల్యూయేషన్ వివరాలను ప్రకటించారు.

  • 16వ స్థానంలో నిజామాబాద్.. 20వ స్థానంలో కామారెడ్డి

బుధవారం ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా 16వ స్థానంలో నిలించింది. 22,694మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 21,928మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 96.62గా నమోదైంది. 11433 మంది బాలురు పరీక్షలకు హాజరు  కాగా 10975 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 11,261  మందికి 10,953 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతంలో బాలుర కంటే బాలికలు ముందంజలో నిలిచారు. కామారెడ్డి జిల్లాలో 94.65 ఉత్తీర్ణత శాతం నమోదైంది. 6,128మంది బాలురు పరీక్షలకు హాజరైతే 5,716మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 6,414 మంది పరీక్షలు రాస్తే 6155 మంది ఉత్తీర్ణులయ్యారు.

The girl has the upper hand in ten results.