20న సార్వత్రిక సమ్మెను సక్సెస్ చేయాలి
భీమ్ గల్, బతుకమ్మ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేశ్ పిలుపునిచ్చారు. సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను మండలంలోని బాబాపూర్ చార్ భాయ్ బీడీ కంపెనీలో శనివారం కార్మికులతో కలిసి రమేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదకొండేళ్ల బీజేపీ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయని ఆవేదన...