Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 May 2025, 2:20 pm Posted by : ramakrishna

తెరుచుకున్న రుద్రనాథ్ ఆలయ ద్వారాలు

వెబ్ న్యూస్, బతుకమ్మ: పంచ కేదార్ నాథ్ క్షేత్రాల్లో ఒకటైన రుద్రనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి ఉత్తరాఖండ్లోని గద్వాల్ హిమాలయ ప్రాంతం చమోలి జిల్లా లోని 11,800 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. ఈ దివ్య క్షేత్రానికి చేరుకునేందుకు 20 కిలోమీటర్ల మేర కష్టతరమైన ట్రెక్కింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆలయ ద్వారాలు తెరవడంతో వచ్చే ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా శివుడికి పూజలు కొనసాగనున్నాయి. మధ్య మహేశ్వర్, తుంగ్ నాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్, కేదార్నాథ్ లను  కలిపి పంచ కేదార్నాథ్ క్షేత్రాలుగా పేర్కొంటారు.