సాయంత్రం తెరుచుకోనున్న ‘పోచారం’ గేట్లు

బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు గేట్లను ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎత్తుతామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.423 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 20,280 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని, ఈ రోజు సాయంత్రం వేళ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తామని నిజాంసాగర్, నాగిరెడ్డి పేట్, ఎల్లారెడ్డి పేట్, హవేలి ఘన్ పూర్ ప్రాంతాల రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రజలను అప్రమత్తం...