Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 September 2024, 2:57 pm Posted by : ramakrishna

సాయంత్రం తెరుచుకోనున్న ‘పోచారం’ గేట్లు

బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు గేట్లను ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎత్తుతామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.423 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 20,280 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని, ఈ రోజు సాయంత్రం వేళ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తామని నిజాంసాగర్, నాగిరెడ్డి పేట్, ఎల్లారెడ్డి పేట్, హవేలి ఘన్ పూర్ ప్రాంతాల రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. మంజీర పరీవాహక ప్రాంతాలైన పోచారం, మూల్తుమ్మేద, గోలిలింగాల్, చీనూర్, మాటూర్, నాగిరేడ్డి పేట్, వేంకంపల్లి, తాండూర్, మాసన్ పల్లి, రూద్రారం గ్రామాల్లో ప్రజలను అలర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.