గంగమ్మ తల్లికి కుంకుమ గాజులతో కుషి తెప్ప విడిచిన గంగపుత్రులు
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలో రేణుక ఎల్లమ్మ పండుగను పురస్కరించుకొని సోమవారం గంగపుత్ర సంఘ సభ్యులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగపుత్ర సంఘానికి చెందిన మహిళలు ఐదు బోనాలతో ఎల్లమ్మ విగ్రహాన్ని తీసుకుని డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గంగమ్మ గుడి వరకు వెళ్లారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం, గౌడ సంఘ సభ్యులు కలిసి గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. చెరువు, నది తీర ప్రాంతాల్లో పారే గంగమ్మకు కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు, పసుపు-కుంకుమలతో ప్రత్యేక...