Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2025, 5:12 pm Posted by : ramakrishna

కుల సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్న గాండ్ల సంఘం

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ఇందూర్ పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేవిదంగా ఐక్యమత్యంతో అంచలంచెలుగా ఎదుగుతుందని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అభినందించారు. ఆదివారం నగరంలోని సిర్నాపల్లి గడిలోని  గాండ్ల పట్టణ సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి  ముఖ్యఅతిథిగా  ధన్ పాల్ సూర్యానారణ హజరై నూతన పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు.. సంఘాల ద్వారా సామాజిక సమైక్యత పెంపొందుతుందని గాండ్ల సంఘం తన సేవా కార్యక్రమాల ద్వారా మంచి మార్గదర్శిగా నిలవాలని ఆశిస్తున్నామన్నారు. గాండ్ల సంఘం అభివృద్ధికి, నూతన కమిటీకి నా పూర్తి మద్దతు ఉంటుంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు బాసోల్ల నాగరాజు, బిజెపి జిల్లా అధ్యక్షులు  దినేష్ కులాచారి, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, రాంభూపాల్, గాండ్ల సంఘం కార్యవర్గం ఉపాధ్యక్షులు ఆసోల్ల రాజేంద్ర, గోపి, సెక్రటరీ కాసర్ల మోహన్, జాయింట్ సెక్రెటరీ సాయన్న,క్యాషియర్ హనుమండ్లు, గాండ్ల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

The Gandla Community Stands as a Model for Other Communities