Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 6:56 pm Posted by : ramakrishna

ఆత్యపత్య క్రీడా అతి పురాతణమైంది

 

. . . డీ ఓ ఎస్ జనరల్ సెక్రటరీ బొబ్బిలి నర్సయ్య

 

నిజామాబాద్ స్పోర్ట్స్, బతుకమ్మ :

 

ఆత్యపత్య అనే క్రీడా అత్యంత పురాతనమైన క్రీడా అని డిస్ట్రిక్ట్ ఒలంపిక్ సంఘం జనరల్ సెక్రటరీ బొబ్బిలి నర్సయ్య అన్నారు. సోమవారం కలెక్టర్ గ్రౌండ్ లో నిర్వహించిన ఆత్యపత్య సబ్ జూనియర్ బాల బాలికల సెలక్షన్ టోర్నికి ముఖ్యఅతిథిగా హాజరై టోర్నిని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆత్యపత్య ఆటకు అనేక రాష్ట్రాల్లో మంచి ప్రాముఖ్యత ఉందన్నారు. పాఠశాల స్థాయి నుండి ఈ ఆటపై దృష్టి సారించి, శిక్షణ తీసుకొని ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. అనంతరం డిస్ట్రిక్ట్ ఆత్యపత్య అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి, సెక్రటరీ సంజీవ్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి అత్యపత్య పోటిల్లో పాల్గొనేందుకు గాను డిస్ట్రిక్ట్ అత్యపత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గ్రౌండ్ లో నిర్వహించిన అత్యపత్య పోటీలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ నెల 10 నుండి హైదరాబాద్ లో జరగబోయే స్టేట్ లెవల్ అత్యపత్య పోటీలకు ఎంపికైన క్రీడాకారులను పంపనున్నట్లు వారు వెల్లడించారు. ముగింపు సమావేశానికి జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్ పాల్గొని క్రీడాకారులకు ఈ క్రీడ యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాము, మీసాల ప్రశాంత్, వ్యాయామ ఉపాధ్యాయులు గంగారెడ్డి, స్వప్న, శోభా, కల్పన, తదితరులు పాల్గొన్నారు.