Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 8:20 pm Posted by : ramakrishna

కల్తీకల్లు, మాదకద్రవ్యాలతో భవిష్యత్తు నాశనం

మద్నూర్, బతుకమ్మ: కల్తీ కల్లు, మాదకద్రవ్యాల అలవాటు తో భవిష్యత్తు నాశనం అవుతుందని మాదకద్రవ్యాల నివారణకు ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని మద్నూర్ ఎస్సై విజయ్ కొండ అన్నారు. మద్నూర్ మండల కేంద్రం తో పాటు తడి హిప్పర్గా, సలబత్పూర్, పెద్ద తడుగూర్ గ్రామాలలో కల్తీ కల్లు, మాదక ద్రవ్యాల పై శనివారం ప్రజలకు అవగాహన కల్పించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ అవగాహన కార్యక్రమంలో మద్నూర్ ఎస్సై విజయ్ కొండ, ఎక్సైజ్ శాఖ అధికారులు, నార్కోటిక్ డి ఫార్మాట్, వివిధ పార్టీల నాయకులు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

The future is being ruined by adulterated opium and drugs.