జిల్లా కలెక్టర్ ను కలిసి నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
నిజామాబాద్ సిటి, బతుకమ్మ: తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లా సంఘం నూతన కార్యవర్గం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతును మర్యాధపూర్వకంగా కలిసారు. సొమవారం జిల్లా కలెక్టరేట్ లో టిఎన్ జిఓ మాజీ జిల్లా అధ్యక్షుడు గైనీ గంగారాం అధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటి కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ హన్మంతు నూతన కార్యవర్గానికి అభినంధనలు తెలుపుతూ సమస్యలు ఎమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కొరారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో...