ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది ఓటు హక్కు

. జాతీయ ఓటరు దినోత్సవంలో కలెక్టర్ పిలుపు నిజామాబాద్,బతుకమ్మ : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు పునాది అని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఓటు హక్కు విలువను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  వీడియో...