Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2025, 2:15 pm Posted by : ramakrishna

కమిషన్ లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు

. ధాన్యం సేకరణలో రాష్ట్ర  ప్రభుత్వం విఫలం

. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులకు కమిషన్ లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, ధాన్యం సేకరణలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. అకాల వర్షం కారణంగా నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో తడిసిన ధాన్యాన్ని ధన్ పాల్ పరామర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..


The focus on commissions is not on farmers.

రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని గొప్పలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందన్నారు. రైతన్నలు పండించిన వరి పంట అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారని అన్నారుకొనుగోలు కేంద్రాల్లో బస్తాలు, హమాలీలు, లారీల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. తరుగు తీయకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.

అనంతరం అడిషనల్ కలెక్టర్ తో ధన్ పాల్ ఫోన్ లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఫసల్ బీమా యోజన అమలు చేస్తుంటే రాష్ట్రంలో అమలు చేయకుండా మోసం చేస్తున్నారన్నారు. తక్షణమే ఫసల్ భీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ గంజ్ ఇన్ చార్జి శకుంతల, బీజేపీ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.