Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 6:41 pm Posted by : ramakrishna

వాడవాడలో మువ్వెన్నల జెండా రెపరెపలు

 

. . . కార్యాలయాలలో, గ్రామాలలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

మండల కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కార్యాలయంలతో పాటు అన్నీ గ్రామాలల్లో, వాడవాడలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో అనంతరావు, పోలీస్ స్టేషన్లో ఎస్సై సందీప్, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో రవి మోహన్ బట్,  తహసీల్దార్ కార్యాలయంలో వెంకటరావు, ఐకెపి ఇందిరా క్రాంతి పథకం కార్యాలయంలో సునీతలు జెండాను ఎగరవేశారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు మండల కేంద్రాలలో జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. గ్రామాలలో సర్పంచులు, యువజన సంఘాల నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పాఠశాలల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

 

The flag of the Three Kingdoms flutters in Vadavada