బతుకమ్మ, నిజామాబాద్ సిటి : ధర్మాన్ని, సంప్రదాయాలు కొనసాగించడటమే వారసత్వ సంపద. నిజామాబాద్ లో బాలాజీ జెండాను బరువుతో కాకుండా భక్తితో మోయడమే ఆర్మూర్ వంశం యొక్క వారసత్వ సంపదగా కొనసాగిస్తున్నారు. నగరంలో జెండా పండుగను పూర్వికులు అయినట్టువంటి ఆర్మూర్ బక్కన్న, అతని అన్నదమ్ములు ఈ జెండా ఉత్సవాలు ప్రతి ఏడాది 11 రోజులు ఘనంగా జరుపుకునేవారు. ప్రస్తుతం వారి వారసులు అయినా తాము జెండా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆర్మూర్ శ్రావణ్ కుమార్ పటేల్ తెలిపారు.ఇందూరు నడి బొద్దున జెండా బాలాజీ మందిర్ నుడి పూలాంగ్ వరకు వైభవంగా 11 రోజులు పాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. జెండా ప్రాముఖ్యత ఏమిటంటే ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా పూర్వికులు కాలంలో వర్షాలు సకాలంలో పడేవి కావని దాంతో ఈ జెండా బాలాజీ దర్శించడం వల్ల వర్షాలు పడి సమృద్దిగా పంటలు పండాలని మహా భక్తుడు తూకొచి మహారాజ్ కాలినడకన తిరుపతి ని దర్శించారు.ఇలా 40 సార్లు దర్శించడంతో 41వ సారి కాలినడకన వెళ్లేసరికి అనేకమైన తూపాన్ వరదలు వచ్చినా సరే తూకోజి మహారాజ్ పట్టువదలక ఇంటి నుండి ఫోటోలతో స్వామి వారు వెంకటేశ్వర్లు ఫోటోతో కాలినడకతో ఇందూరు లో నడ్డిబొడ్డున జెండాగల్లి జెండా మందిరం అక్కడ నిద్రించిన సమయంలో సిర్నాపల్లి మహారాజ్ కి కలలో కనిపించి వెంకటేశ్వరా స్వామీవారు స్వప్నం లో మందిరాన్ని నిర్మించాలని చెప్పడంతో తెల్లవారుజామున సిర్నాపల్లి మహారాజ్ జెండాగల్లీ కి స్థలం వద్దకు వచ్చి స్వప్నం లో వచ్చి కళ ను తూకొజి మహారాజ్ చెప్పి నర్సాగౌడ్ ముందుకు వచ్చి ఈ స్థలం లో తూకొజి మహారాజ్ విగ్రహాన్ని స్థాపించి ఈ యొక్క జెండా ప్రాముఖ్యతను గుడిని నిర్మించడం జరిగిందన్నారు. చక్కర, తీపి, లడ్డు చాలా విషయాలతో వెంకటేశ్వరాల స్వామి కి చాలా ఘనంగా పూజిస్తామన్నారు. ముఖ్యంగా చక్కర తీర్థంగా ఈ యొక్క బాలాజీని కొలుస్తారని,కోరిన కోరికలు అడగగానే తీర్చి పవిత్ర పుణ్యస్థలం గా అంచెలు అంచెలుగా ఎదిగి రాష్టంలోని తెలంగాణ, ఆంధ్రా,మహారాష్ట్ర, కర్ణాటక నుండి జెండా జాతర లో పాల్గొంటారన్నారు. ఇలా 100 సంవత్సరాలు పైగా చక్కరా జెండా బాలాజీ జాతర నడుస్తూ ఉందన్నారు. ఇందూరులో జరిగే జెండా పండగకు ఆర్మూర్ వంశం ఆ బాధ్యతలను భూజల మీద మోస్తూ, తరతరాలుగా హైందవ సమాజానికి అది కూడా హిందువుల ఊరు ఇందూరుకు అండగా నిలవడం మా వంశానికి చేసుకున్న పుణ్య ఫలల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చన్నారు.