Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 2:36 pm Posted by : ramakrishna

తొలి దశ ఉద్యమం ఓయూలో పుట్టింది

హైదరాబాద్, బతుకమ్మ : ఓయూలోనే తొలి దశ ఉద్యమం పుట్టిందని, ఆ ఉద్యమం ఫలించక పోవడంతోనే విద్యార్థులు అటవి బాట పట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.  అంతర్జాతీయ ప్రమాణాలతో ఓయూను తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే వచ్చానని పేర్కొన్నారు. మనపై ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటే పోరాటం పుట్టుకువస్తుందని తెలిపారు. నల్లమలలో పెరిగానని, పేదరికం చూశానని నాకు భాష గొప్పగా రాకపోవచ్చు.. ప్రజల మనసు తెలుసుకునే విద్యా నాకు తెలుసు అని రేవంత్ రెడ్డిపేర్కొన్నారు.  బడికి వెళ్లని అందెశ్రీ తెలంగాణ ఉద్యమ గేయాన్ని రచించారని తెలిపారు. ఓయూలో మంత్రులు, సీఎంలను అడ్డుకునే చరిత్ర ఉందని, మీరెందుకు వెళ్తున్నారని నన్ను అడిగారని, మీరు చాలా ధైర్యం చేస్తున్నారని కొందరు అన్నారని సీఎం  వెల్లడించారు. నాది ధైర్యం కాదు, అభిమానమని.. నా తమ్ముళ్లు ఉన్న యూనివర్సిటీకి వెళ్లేందుకు ధైర్యం అవసరమా.. గుండెల నిండా అభిమానంతో భవిష్యత్ ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చానని సీఎం ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

ఓయూకు రూ. వెయ్యి కోట్లు ఉత్తర్వులు జారీ

ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం రూ. 1000 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈజీవోను విద్యార్థులకు అంకితమిస్తున్నట్లు రేవంత్ పేర్కొన్నారు.